కోతుల బెడ‌ద నుంచి ర‌క్ష‌ణ కోసం కొండ‌ముచ్చు బ‌హుక‌ర‌ణ

by Ratna Kumari |

మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నర్రా ఎల్లారెడ్డి సౌజన్య దంపతులు ' ముకుందాపురం ఎంప్లాయీస్ అసోసియేషన్ ' సహకారంతో బుధవారం గ్రామ పంచాయతీకి కొండముచ్చును బహుకరించారు.

కోతుల బెడ‌ద నుంచి ర‌క్ష‌ణ కోసం కొండ‌ముచ్చు బ‌హుక‌ర‌ణ
X

దిశ‌, మున‌గాల : మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో గ్రామానికి చెందిన కానిస్టేబుల్ నర్రా ఎల్లారెడ్డి సౌజన్య దంపతులు ' ముకుందాపురం ఎంప్లాయీస్ అసోసియేషన్ ' సహకారంతో బుధవారం గ్రామ పంచాయతీకి కొండముచ్చును బహుకరించారు. ఎల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కోతులు ఎక్కువగా ఉండటంతో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నిసార్లు కోతులను పంపించిన మళ్ళీ వస్తుండటంతో గ్రామ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని, స్కూల్ పిల్లలు బడికి వెళ్ళాలంటే కోతులతో భయపడుతున్నారని తెలిపారు. గ్రామంలో కొండముచ్చు ఉన్నట్లయితే కోతులురాకుండా ఉంటాయని కొండముచ్చును తెప్పించినట్లు తెలిపారు. దానిని గ్రామ పంచాయతీకి అప్పగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉప సర్పంచ్ నర్రా శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్, బొల్లా వెంకట రెడ్డి, కొల్లాపురి మహేష్, పెద్ద లక్ష్మణ్, నలబోలు శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల శ్రీను, జూలు నాగార్జున, గుండు వెంకన్న, బొల్లా నర్సిరెడ్డి పాల్గొన్నారు.

Next Story