- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల ఖర్చుల నిబంధనలపై అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరు ఎన్నికల ఖర్చుల నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని స్త్రీ శక్తి ఉపాధి హామీ భవనంలో అభ్యర్థుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, భూదాన్ పోచంపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరు ఎన్నికల ఖర్చుల నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని స్త్రీ శక్తి ఉపాధి హామీ భవనంలో అభ్యర్థుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధానం, అభ్యర్థులు ఖర్చు చేయాల్సిన పరిమితులు, ఎన్నికల నియమావళి తదితర అంశాలను వివరించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 5000 కంటే తక్కువగా జనాభా ఉన్న గ్రామాలలో సర్పంచ్‌కు 1.50 వేల రూపాయలు వార్డు మెంబర్లకు 30వేల రూపాయలు లోపు ఖర్చు చేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి ప్రతి అభ్యర్థి తీసుకున్న ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రమే లావాదేవీలు జరపాలన్నారు. అదేవిధంగా ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఫలితాలు వెలుబడిన రోజు నుంచి 45 రోజుల్లో ఎన్నికల ఖర్చుకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల వ్యయ పరిశీలకులు, సురేష్, ఎంపీడీవో భాస్కర్, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల శిక్షకులు యాదగిరి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సమావేశం పై అభ్యర్థుల అసహనం
ఎన్నికల ఖర్చుల నిబంధనలపై ఏర్పాటు చేసిన సమావేశం తీరుపై సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని 21 గ్రామపంచాయతీలకు గాను శివారెడ్డి గూడెం గ్రామపంచాయతీ ఏకగ్రీవం కాగా మిగతా 20 గ్రామ పంచాయతీలకు గాను 51 మంది సర్పంచ్ అభ్యర్థులుగా, 177 వార్డులకు గాను 381 మంది వార్డు మెంబర్లుగా బరిలో ఉన్నారు. అయితే ఆదివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని స్త్రీ శక్తి ఉపాధి హామీ భవనంలో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల నియమ నిబంధనలపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. పోటీ చేసే సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులతో పాటు మరి కొంతమంది ఇతర వ్యక్తులు లోనికి ప్రవేశించడంతో సమావేశపు గది పూర్తిగా నిండిపోయింది. దీంతో కొంతమంది బరిలో ఉన్న అభ్యర్థులు లోన స్థలం లేక బయట నుండి వీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం పోటీ చేసే అభ్యర్థులనే కాకుండా ఇతర వ్యక్తులను లోనికి అనుమతించడంతో బరిలో ఉన్న అభ్యర్థులు అసహనానికి గురయ్యారు.






