పురాత‌న పరిక‌రాలు, వ‌స్తువుల‌ను నాగార్జున సాగ‌ర్ మ్యూజియంకి అందివ్వాలి : మ‌ట్టి మ‌నిషి వేనేప‌ల్లి పాండురంగారావు

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆత్మకూరు(ఎం) : నాగార్జునసాగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియానికి గ్రామాలలో ఉన్న పురాతన పరికరాలు, వస్తువులను అందివ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు,

పురాత‌న పరిక‌రాలు, వ‌స్తువుల‌ను నాగార్జున సాగ‌ర్ మ్యూజియంకి అందివ్వాలి : మ‌ట్టి మ‌నిషి వేనేప‌ల్లి పాండురంగారావు
X

దిశ, ఆత్మకూరు(ఎం) : నాగార్జునసాగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియానికి గ్రామాలలో ఉన్న పురాతన పరికరాలు, వస్తువులను అందివ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయ‌న‌ మాట్లాడుతూ ప్రజల జీవన శైలి కోసం ఏర్పాటుచేసిన మ్యూజియానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వివిధ గ్రామాలలో బయటపడుతున్న పురాతన వస్తువులు, పరికరాలైన విగ్రహాలు, ఇత్తడి దువ్వెనలు, కాటుక దాచుకునే పాత్ర, పురాతన కుంకుమ భరిణె, తెల్ల వెంట్రుకలు తొలగించేందుకు, ముల్లు తీసేందుకు వాడే ఇత్తడి చిమ్మట, తిలకం పెట్టుకునే భరిణె, గోళ్లు కత్తిరించుకునే కత్తి, గొళ్లెం, తలుపు చెక్కిన తీరు, తలుపు షేర్లు, జానపద కలలకు సంబంధించిన చిత్రాలను అందజేయాలని కోరారు. వివరాల కోసం 9848015364 సంప్రదించాలని కోరారు.

Next Story