గోండ్రియాల రేషన్ డీలర్ సస్పెన్షన్...

by Bhanu |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించింది. అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని అవసరమైతే లబ్ధిదారుల కార్డులు సైతం రద్దు చేసేందుకు సిద్ధమయింది.

గోండ్రియాల రేషన్ డీలర్ సస్పెన్షన్...
X

దిశ, అనంతగిరి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించింది. అక్రమాలు జరిగితే ఉపేక్షించేది లేదని అవసరమైతే లబ్ధిదారుల కార్డులు సైతం రద్దు చేసేందుకు సిద్ధమయింది. ఇటీవల తాండూరు మండంలోని అచలాపూర్‌ గ్రామంలో శనివారం అధికారులు 11 రేషన్‌ కార్డులు రద్దుచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో బియ్యం అక్రమ రవాణాకు చాలావరకు అడుకట్ట పడుతుంది. అక్రమంగా రేషన్ బియ్యం అమ్ముతున్న డీలర్లపై కూడా ప్రభుత్వం కూడా కొరడా జులుపిస్తుంది. అక్రమంగా అమ్ముతున్న అనంతగిరి మండలం గోండ్రియాలలో రేషన్ డీలర్ను సివిల్ సప్లయ్ అధికారులు సస్పెండ్ చేశారు. అలాగే డీలర్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. అధికారులు తెలిపిన వివరాలు.. అనంతగిరి మండలం గోండ్రియాలలో రేషన్ షాపు-13 నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్ర యిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అనంత గిరి ఆర్ఎ వెంకటనగేష్ బుధవారం గోండ్రియాల శివారులో తనిఖీలు చేపట్టారు.


తనిఖీలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారాం తండాకు చెందిన బాణోతు సైదులు 50 కేజీల సన్నబియ్యా న్ని తీసుకెళ్తుతూ పట్టుబడ్డాడు. ఈ మేరకు ఆ వ్యక్తిని విచారణ చేయగా గోండ్రియాలలోని 13వ నెంబర్ షాప్ డీలర్ లీలాకుమారి, ఆమె భర్త యడ్లపల్లి నర సింహారావు దగ్గర 50 కేజీల రేషన్ బియ్యాన్ని రూ.1,350కు కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దీం తో ఆర్ఐ వెంకటనగేష్ ఇచ్చిన సమాచారం మేరకు సివిల్ సప్లయ్ అధికారులు సంయుక్తంగా రేషన్ షాపు13లో తనిఖీలు చేపట్టగా ఉండాల్సిన స్టాక్ కం టే 98 కేజీల రేషన్ బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రేషన్ డీలర్ లీలాకుమారి, యడ్లపల్లి నర్సింహారావు, బాణోతు సైదులుపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు డీటీసీఎస్ మైలా రాం రెడ్డి తెలిపారు. అదేవిధంగా డీలర్ను సస్పెండ్ చేసి రేషన్ పాపు బాధ్యతలను మరో డీలర్కు అప్పగిం చారు. అనంతగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్టేషన్లో సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసు లు నమోదు చేసినట్లు ఏఎస్ఐ లింగారెడ్డి తెలిపారు. తనిఖీలో సివిల్ సప్లయ్ బండి కృష్ణారెడ్డి ఉన్నారు.



Next Story