- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్గొండలో ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
జిల్లాలో రైతులకు సబ్సిడీపై అందిస్తున్న డ్రిప్,వ్యవసాయ పరికరాలు పంపులు,రోటవేటర్లు బుష్ కట్టర్లు అందించి జిల్లాలో

దిశ, కనగల్లు: జిల్లాలో రైతులకు సబ్సిడీపై అందిస్తున్న డ్రిప్,వ్యవసాయ పరికరాలు పంపులు,రోటవేటర్లు బుష్ కట్టర్లు అందించి జిల్లాలో ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నల్గొండ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గోలి జగాల్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన వ్యవసాయ, సంక్షేమ శాఖ చైర్మన్ కోదండ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఇబ్బందులను గమనించి కనగల్లు, తిప్పర్తి, మాడుగులపల్లి,నల్గొండ పరిధిలో తన సొంత నిధులు దాదాపు రెండు కోట్లతో అన్ని కాలువల డిస్ట్రిబ్యూటర్లలో పూడిక తీయించి రైతులు పంటలు పండించుకోవడానికి ఇబ్బంది లేకుండా మంత్రి కోమటిరెడ్డి చేశారన్నారు. అన్ని చెరువులు,కుంటలు నింపి అన్ని గ్రామాలలో ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బత్తాయి మార్కెట్లో రైతులకు శిక్షణ శిబిరాలు నిర్వహించి,వాణిజ్య పంటల వైపు మళ్లించాలని వెల్లడించారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా జిల్లాలో పత్తి మిల్లులను అదనంగా ఏర్పాటు చేయాలని అన్నారు. పామాయిల్ తోటలు ఎక్కువగా సాగు చేయుచున్నందున జిల్లా పరిధిలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అదే విధంగా రైతులకు అన్ని పంటలపై అవగాహన సదస్సులు ఎక్కువగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.






