కటకటాల్లోకి దోపిడీ దొంగలు

by Nallavelli.Anjaneyulu |

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని దోపిడీలు, చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

కటకటాల్లోకి దోపిడీ దొంగలు
X

దిశ, నల్లగొండ క్రైం: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని దోపిడీలు, చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. నల్లగొండ డీపీవోలో అదనపు ఎస్పీ జీ.రమేష్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్ల‌డించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గోరెంట్ల గ్రామానికి చెందిన గునిగంటి మహేష్ బైక్ మెకానిక్ గా, హైదరాబాద్ లోని చంపాపేట్ కు చెందిన పాథ్లావత్ వినయ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారు. వీరు గతంతో రాష్ట్రం వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బాధితులను బెదిరిస్తూ చోరీలకు పాల్పడటంతో పోలీసులు పట్టుకుని జైలుకు తరలించారు. విడుదలైన తర్వాత కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో గత నవంబర్ 28న రాత్రి 7.30 గంటల సమయంలో ఉప్పుల వెంకటరమణ అనే మహిళ ఇంటి ముందు గేదెలను గడ్డి వేస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి, కత్తితో గాయపరిచి తన మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు, చెవి దిద్దులు చోరీ చేసి హైదరాబాద్ పారిపోయాడు. బాధితులు కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 13న నార్కెట్ పల్లి వచ్చి ఓ ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్ ను దొంగిలించి పారిపోతుండగా, కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద నిందితులను పట్టుకున్నారు. విచారణ చేయగా వారు చైసిన క్రైం వివరాలను వెళ్లడించారు. గతంలో వీరు రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని వివిధ మండలాల్లో ఇండ్లలో దొంగతానాలు, సెల్ ఫోన్లు చోరీలు చేసిన కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చారు. వీరి వద్ద నుంచి రెండు బైకులు, రెండు తులాల బంగారు చైన్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపించారు.

Next Story