ఓపీఎం మాదకద్రవ్యాన్ని విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

by Ratna Kumari |

అక్రమంగా ఓపీఎం పాపి హస్క్ అనే మాదకద్రవ్యాన్ని లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్న నిందితున్ని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ కే శివరాం రెడ్డి తెలిపారు.

ఓపీఎం  మాదకద్రవ్యాన్ని విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
X

దిశ‌, చిట్యాల‌ : అక్రమంగా ఓపీఎం పాపి హస్క్ అనే మాదకద్రవ్యాన్ని లారీ డ్రైవర్లకు విక్రయిస్తున్న నిందితున్ని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ కే శివరాం రెడ్డి తెలిపారు. శనివారం చిట్యాల పట్టణ కేంద్రంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులో జాతీయ రహదారి 65 పై ఉన్న డూన్ పంజాబీ దాబా లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ కు చెందిన దాబా యజమాని గుర్నిత్ సింగ్ గత కొంతకాలంగా నిషేధిత మాదకద్రవ్యమైన ఓపియం పాపి హస్క్ ఉందని దానిని దాబాలోని కస్టమర్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడని వచ్చిన సమాచారం మేరకు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి సుమారు 10 గంటలకు దాబాకు వెళ్లి యజమాని గుర్నిత్ సింగ్ నిషేధిత ఓపియం పాపి హస్క్ ను వాహనదారులకు విక్రయిస్తుండగా పట్టుబడి చేశారు. అనంతరం ఎస్సై మామిడి రవికుమార్ దాబా యజమానిని విచారించగా సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను లారీ డ్రైవర్ల నుండి తాను ఓపిఎం పాపి హస్కును ఒక్క కిలో రూ.1800 కొనుగోలు చేసి దానిని తిరిగి కిలో రూ.6000 చొప్పున వాహన దారులకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. కొద్దిరోజుల క్రితం 10 కిలోల ఓపియం పాపి హస్క్ కొనుగోలు చేసి అందులో సుమారు ఒక కిలో కస్టమర్లకు విక్రయించి మిగిలిన 9 కిలోల ఓపియం పాపి హస్కును డాబా లోని తన గదిలో దాచి పెట్టినట్లు తెలిపారు. దాబా యజమాని నుండి 54000 రూపాయల నగదు, 9 కిలోల ఓపియం పాపి హస్క్, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నల్గొండ డిఎస్పి కే శివరాంరెడ్డి పర్యవేక్షణలో నార్కెట్పల్లి సీఐ కే నాగరాజు ఆధ్వర్యంలో ఎస్సై ఎం రవికుమార్ స్టేషన్ సిబ్బంది లు చేసిన పనికి డీఎస్పీ వారిని అభినందించారు.

మాదకద్రవ్యాల పై ఉక్కు పాదం.. డీఎస్పీ శివరాం రెడ్డి

అక్రమ మాలికద్రవ్యాల ను సరఫరా చేసిన అమ్మిన వినియోగించిన ఉపేక్షించేది లేదని అట్టి వారిపై ఉక్కు పాదంతో అంచివేసేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి సరఫరా అమ్మే వ్యక్తులపైనే కాకుండా సేవించే వ్యక్తుల పైన కూడా చట్టపరమైన శిక్షలు తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాల ఎవరైనా విక్రయించిన సేవించిన 100 నెంబర్ కు గాని లేదా 8712670266 నెంబర్కు గాని సమాచారం అందించినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.. ఈ సమావేశంలో నార్క‌ట్ ప‌ల్లి సీఐ కే నాగరాజు, చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్, మునుగోడు ఎస్సై ఇరిగి రవి, సిబ్బంది పాల్గొన్నారు..

Next Story