- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దైవ దర్శనానికి వెళ్లి గుండంలో పడి వివాహిత మృతి
దైవదర్శనానికి వెళ్లి గుండంలో జారిపడి వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

దిశ, వలిగొండ: దైవదర్శనానికి వెళ్లి గుండంలో జారిపడి వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామానికి చెందిన కర్రే లాస్య సంక్రాత్రి పండుగకు తన తల్లిగారి ఊరైన పులిగిల్లకు వచ్చింది. అయితే ఆదివారం తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా పూజ చేయడానికి స్థానిక గుట్టపై రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లింది. ఈక్రమంలో గుండంలో కాళ్లు కడుక్కొంటుండగా.. ప్రమాదవశాత్తు గుండంలో జారిపడింది. గమనించిన స్థానికులు గుండం నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందింది. మృతురాలు దర్శనానికి వెళ్లే సమయంలో తన తండ్రితో వీడియోలు తీసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయగా.. అది చూసిన గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు.






