ప్రగతి ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్.. ఆకట్టుకున్న పిల్లల ప్రాజెక్ట్ వర్స్క్

by Shiva |
ప్రగతి ఉన్నత పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్.. ఆకట్టుకున్న పిల్లల ప్రాజెక్ట్ వర్స్క్
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం, ఎల్లంబావిలో గ్రామంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ ఫెయిర్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులు పలు రకాల ప్రాజెక్ట్ వర్క్స్‌ను సొంతంగా తయారు చేసిన ప్రదర్శనలో వాటి పనితీరును తోటి విద్యార్థులు, తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్‌డీ సయ్యద్ మాట్లాడుతూ.. పిల్లల మనో వికాసానికి సైన్స్ ఫెయిర్‌లు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు.

సరిగ్గా ఇదే రోజున (ఫిబ్రవరి 28, 1928)న ప్రఖ్యాత భారత భౌతిక శాస్త్ర నిపుణుడు సర్ సీవీ రామన్ ‘రామన్ ఎఫెక్ట్’ కనుగొన్న సందర్భంగా భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డేగా జరుపుకుంటారని తెలిపారు. విద్యార్థులంతా సీవీ రామన్‌ను ఆదర్శంగా తీసుకుని నూతన సైన్స్ రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. సైన్స్ ఫెయిర్‌‌లో భాగంగా విద్యార్థులు చంద్రయాన్-3, నర్స్వ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, విండ్ మిల్, వాటర్ క్యూరిఫికేషన్, డయాలసిస్, హార్ట్ వర్కింగ్ సిస్టమ్ లాంటి ప్రాజెక్ట్ వర్స్క్ చేసి, వాటి పనితీరును వివరిస్తూ.. అందరిచేత ప్రశంసలు పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story