- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, మర్రిగూడ (నాంపల్లి) : అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్న ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి జరిగింది. బియ్యం కొనడానికి తెచ్చిన 50,000 వేల నగదు షిఫ్ట్ కార్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దేవత్ పల్లి గ్రామం నుండి రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా టీఎస్ 31 టి 0193 వాహనంలో 80 బ్యాగులు మొత్తం 40 కింటాలు గల వాహనాన్ని చారగొండ మండలానికి చెందిన నాయిని సంపదయ్య, గాసిరాం తండా గుర్రంపోడు మండలానికి చెందిన కుర్ర నాగరాజు తరలిస్తుండగా పట్టుకున్నారు. కల్వకుర్తిలోని రైస్ మిల్లులకు వీళ్లు తరలిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story






