- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుడి భూమికే దిక్కులేదు
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 65 కు ఆనుకొని ఓ బడా వ్యాపారి కార్పొరేట్ స్థాయిలో హోటల్ నిర్మాణం చేశాడు. ఆయన భూమి పక్కనే శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయానికి చెందిన భూమి వంద ఎకరాలు ఉంది. బడా వ్యాపారి కన్ను దేవాలయం భూమి మీద పడింది.

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 65 కు ఆనుకొని ఓ బడా వ్యాపారి కార్పొరేట్ స్థాయిలో హోటల్ నిర్మాణం చేశాడు. ఆయన భూమి పక్కనే శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయానికి చెందిన భూమి వంద ఎకరాలు ఉంది. బడా వ్యాపారి కన్ను దేవాలయం భూమి మీద పడింది. ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నాడు.బహిరంగ మార్కెట్ లో ఎకరం భూమి విలువ రూ. రెండు కోట్లు పైనే. మా ఊరి భూములు కబ్జా అవుతున్నాయి పట్టించుకోండి మహాప్రభో అంటూ వినతి పత్రాలు ఇచ్చిన వాటిని అధికారులు చెత్తబుట్టలో వేస్తున్నారు. ఎవరైనా అడిగితే మా దృష్టికి రాలేదు.... మాకు తెలియదు అంటూ చేతులు దులిపేస్తున్నారు. కబ్జాదారులకు వెనుక ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా అక్రమార్కులకు అధికారులకు మధ్య పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పెద్ద ఎత్తున్న చర్చ జరగుతుంది. -దిశ నల్లగొండ బ్యూరో
దిశ నల్లగొండ బ్యూరో: భాజాప్తాగా.... జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న విలువైన భూములను అప్పనంగా కబ్జా చేస్తున్నారు... కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మిస్తుంటే అధికారులకు పట్టదు... పూర్తి వివరాల్లోకి వెళితే.....
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలో హైదరాబాద్ -- విజయవాడ జాతీయ రహదారి 65 కు ఆనుకొని ఓ వ్యాపారి కార్పొరేట్ స్థాయిలో హోటల్ నిర్మాణం చేసుకున్నాడు. ఆ యజమానికి సర్వే నెంబర్ 199/2/1, 199/2/2 లలో దాదాపు 2.22 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో ప్రస్తుతం హోటల్ నిర్మాణం పూర్తయి వ్యాపారం సాగుతుంది. హోటల్ వెనుక వైపు పెదకాపర్తి గ్రామానికి శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయానికి చెందిన భూమి 201, 201/2, 201/ప,
201/ప/1 , 201/ప/1/2 సర్వే నెంబర్ లలో సుమారు 100 ఎకరాల్లో ఉంది. ఇందులో దాదాపు 75 ఎకరాల భూమి దేవాదాయ శాఖ, 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి పూర్తిగా రాళ్లు ( గుండ్లు), చెట్ల తో నిండి ఉంది. అయితే ఇక్కడ గ్రామానికి సంబంధించిన రైతులు తమ పశువులు మేకలు, గొర్రెలను మేపుకుంటూ ఉంటారు. అయితే తన తన హోటల్ వెనకాల ఉన్న గుట్టను మొత్తం పెకిలించి సుమారు రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి చుట్టూ గోడ కట్టేందుకు పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. అయితే తనకున్న 2.22 ఎకరాల భూమి కాకుండా అదనంగా మరో రెండు ఎకరాలకు పైగా హోటల్ వ్యాపారి ఆక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆ పక్కనే ఉన్న ఓ గ్రానైట్ వ్యాపారి కూడా తన కంపెనీకి వెనుక వైపు ఉన్న దేవాలయ భూమిలో సుమారు ఎకరం వరకు కబ్జా చేసినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా మూడు ఎకరాలకు పైగా దేవాలయ భూమిని ఇద్దరు వ్యాపారులు కలిసి తమ గుప్పిట్లో పెట్టుకున్నారు.
కబ్జా భూమి విలువ రూ.6కోట్లకు పైనే....
పెదకాపర్తి గ్రామ పరిధిలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి పక్కనే హోటల్ యజమాని 2 ఎకరాలు, మరో గ్రానైట్ వ్యాపారి ఎకరం ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ప్రస్తుతం ఆ భూమి విలువ ఎకరం రూ.2 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అయితే మొత్తం మూడు ఎకరాలకు పైగా కబ్జా అయిన భూమి విలువ రూ. 6 కోట్ల కు పైగా ఉంటుందని సమాచారం. అంతటి విలువైన భూమిని అప్పనంగా గద్దల మాదిరిగా కబ్జాకోర్లు కొట్టేస్తుంటే అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామానికి చెందిన దాదాపు ఏడాది కాలంగా మండల రెవెన్యూ అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు అన్ని స్థాయిల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అయినా ఏ ఒక్క అధికారి కూడా స్పందించిన దాఖలాలు లేవు.
అన్యాక్రాంతమవుతున్న పట్టదా.....?
చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ప్రభుత్వ, దేవాదాయశాఖ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఫిర్యాదు చేసిన మండల రెవెన్యూ అధికారి పట్టించుకోలేదు. దీంతో గ్రామానికి చెందిన యువత రెవెన్యూ డివిజనల్ అధికారికి పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. అయితే చిట్యాల మండలంలోని ప్రతి గ్రామానికి వివిధ కార్యక్రమాల దృష్ట్యా ఆర్డీవో విచ్చేశారు. కానీ పెద్ద కాపర్తి గ్రామానికి మాత్రం ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా సందర్శించి భూ సమస్యను పరిష్కరించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు గ్రామానికి చెందిన యువత ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే హైదరాబాద్ కు చెందిన ఓ న్యాయవాది పెదకాపర్తి దేవాదాయ, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతమవుతున్న విషయంపై గ్రామస్తులు పిటిషన్ ఇచ్చారు.... దానిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా... అని అడిగితే తన దృష్టికి ఎలాంటి పిటీషన్ రాలేదని చేతులు దులుపుకున్నట్లు సమాచారం.. ఇదంతా గమనిస్తే ఆ సమస్య జోలికి వెళ్లకుండా ఉండాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
లావాదేవీలు జరిగినందునే.....??
చేకూరి గణేష్ మాదిగ, పెద్దకాపర్తి,
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.
ఏడాదికాలంగా అన్నిస్థాయిలో అధికారులకు కబ్జా గురవుతున్న భూమిని కాపాడాలని వినతిపత్రులు ఇచ్చాం. కానీ ఒక్క అధికారి కూడా ఇప్పటివరకు విచారణ చేసిన దాఖలాలు లేవు. అక్రమార్కుల నుంచి అధికారులకు పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినందున ఇలాంటి విచారణకు రెవెన్యూ అధికారులు పూనుకోవడం లేదు .ఇదే పరిస్థితి కొనసాగితే అధికారులపై కోర్టు కూడా వెళతాం.. మా ఊరి భూములను మేము కాపాడుకుంటాం.






