- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS : 21న నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)ఇచ్చిన ఎన్నికల హామీల(Farmers Guarantees)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్(BRS) పార్టీ ఈ నెల 21న తలపెట్టిన రైతు మహాధర్నా(Farmer's Mahadharna)ను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి నల్లగొండ(Nalgonda)గడియారం సెంటర్ లో నిర్వహస్తున్నట్లుగా స్థానిక మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి(Former MLA Kancharla Bhupal Reddy)తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)ఇచ్చిన ఎన్నికల హామీల(Farmers Guarantees)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్(BRS) పార్టీ ఈ నెల 21న తలపెట్టిన రైతు మహాధర్నా(Farmer's Mahadharna)ను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి నల్లగొండ(Nalgonda)గడియారం సెంటర్ లో నిర్వహస్తున్నట్లుగా స్థానిక మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి(Former MLA Kancharla Bhupal Reddy)తెలిపారు. ఈ ధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హాజరవుతారని వెల్లడించారు.
మోసపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని భూపాల్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా రైతులను తప్పుడు వాగ్దానాలతో.. మోసం చేస్తున్నదని, రైతు రుణమాఫీ కేవలం 35 శాతం మందికి మాత్రమే మాఫీ చేసి చేతులు దులుపుకుందని..రైతు భరోసా కూడా అనేక ఆంక్షలు పెట్టి... ఎకరాకు 15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 12వేలు ఇస్తామంటున్నారని, రూ.500బోనస్ నామమాత్రమైందని, 24గంటల కరెంటు రావడం లేదన్నారు. రైతులకు కాంగ్రెస్ చేసిన మోసాలను నిరసిస్తూ తలపెట్టిన రైతు మహాధర్నాకు రైతులు భారీగా హాజరుకావాలని కోరారు.
ధర్నా సన్నాహాలపై పార్టీ నాయకులతో సమావేశం అనంతరం ధర్నా ఏర్పాట్లను పార్టీ ముఖ్య నాయకులతో వన్ టౌన్, టూ టౌన్ సీఐలతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కో ఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రీ, పేర్ల అశోక్ తదితరులు ఉన్నారు.






