- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NewYork : అమెరికాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. భోగి పండ్ల ఉత్సవం నిర్వహించిన నైటా
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో స్థిరపడిన తెలుగు వారు ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో స్థిరపడిన తెలుగు వారు ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న పిల్లలకు భోగి పండ్లు కార్యక్రమం చేశారు. స్థానిక సౌతర్న్ పార్క్ వేలో ఉన్న సాయి మందిర్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కుటుంబాలు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నాయి.
అమెరికాలోనే పుట్టి పెరిగిన చిన్నారులకు మన పండుగలు, సంప్రదాయాలు తెలిసేలా పండుగలను ప్రతి యేటా నైటా నిర్వహిస్తోంది. రేగు పండ్లు, నాణేలు, పూలు, చెరకు ముక్కలతో భోగిపండ్లు పోసి, పిల్లలందరూ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేడుకలు నిర్వహించారు పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు, పైళ్ల సాధన మల్లారెడ్డి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. నైటా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు విజయవంతంగా నిర్వహించినట్లు నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తెలిపారు.






