- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RTC: ఆర్టీసీకి కొత్త బాస్.. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డి
ఆర్టీసీకి ఎండీగా వై.నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ((TGRTC)) నూతన ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వై.నాగిరెడ్డి (Y.Nagireddy) ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా సేవలందించిన సజ్జనార్ హైదరాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నాగిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. నాగిరెడ్డి ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా పని చేశారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు నేడు చివరి రోజు కావడంతో ఆయన ఇవాళ ఆర్టీసీ బస్సులో సాధారణ వ్యక్తిలా ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను భావోద్వేగానికి లోనవుతూ ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 'నా స్టాప్ వచ్చేసింది.. నాలుగేళ్లకు పైగా టీజీఎస్ఆర్టీసీ స్టీరింగ్ తర్వాత ఇప్పుడు బస్సు దిగి కొత్త మార్గంలో బయలుదేరే సమయం వచ్చింది. ప్రయాణాలు ఆగిపోతాయి. ప్రయాణికులు దిగిపోతుంటారు. కానీ రోడ్డు మాత్రం ఎప్పటికీ ముందుకు సాగుతూనే ఉంటుంది అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.






