డాడీ, మోడీ, చిన్నమోడీపై నా పోరాటం.. కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-19 09:47:30  IST  )

ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ శ్రీరామనవమికి కల్వకుంట్ల కవితకు చెందిన కొత్త పొలిటికల్ పార్టీ ఆవిర్భవించనుంది.

డాడీ, మోడీ, చిన్నమోడీపై నా పోరాటం.. కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: డాడీ, మోడీ, చిన్నమోడీపైనే తన పోరాటమని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోందని అన్నారు. గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని తెలిపారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌తో నా ఇష్యూను కాంగ్రెస్, సీఎం రేవంత్ అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ ప్రారంభించగానే అజెండా, లక్ష్యాలను కూడా ప్రకటిస్తానని అన్నారు. అయితే, కొత్త పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరును అనుకుంటున్నారు. పార్టీ గుర్తుగా ‘ధర్మ గంట’ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. రానున్న శ్రీరామనవమికి పార్టీ పేరుతో పాటు గుర్తను కవిత అనౌన్స్ చేయనున్నారు.

హైకోర్టులో ఊరట..

కాగా, మరోవైసు కొత్త పొలిటికల్ పార్టీ వ్యవహారంలో కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచించింది. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో నూతన రాజకీయ పార్టీ నమోదు కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో ఈసీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని కవిత తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్‍పై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం ‘తెలంగాణ ప్రజా జాగృతి’పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్‍కు ఆదేశాలు జారీ చేసింది.

Next Story