- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లోని ముస్లింలు నా వల్ల కోటీశ్వరులయ్యారు.. CM చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్ (Hyderabad)లోని ఓల్డ్ సిటీ ముస్లింలు తన వల్ల కోటీశ్వరులయ్యారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లోని ఓల్డ్ సిటీ ముస్లింలు తన వల్ల కోటీశ్వరులయ్యారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ ఆయన విశాఖలో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా ఉన్న నాడు హైదరాబాద్ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చానని అన్నారు. సమస్యాత్మక ప్రాంతమైన ఓల్డ్ సిటీ పక్కనే దూరదృష్టితో ఆనాడే ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేశామని తెలిపారు. సిటీ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేస్తే.. ఓల్డ్ సిటీ పరిధిలోని ముస్లింలు అంతా కోటీశ్వరులు, లక్షాధికారులు అయ్యారని గుర్తు చేశారు. హైదరాబాద్ పర్యటనకు విదేశీ ప్రముఖులు ఎవరు వచ్చినా ఓల్డ్ సిటీకి వెళ్లి షాపింగ్ చేసే విధంగా పెరల్స్ (ముత్యాలను) ప్రమోట్ చేసింది తానేనని అన్నారు. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేసిన చరిత్ర తమదని పేర్కొన్నారు. నగరంలో నిరుపయోగంగా పడి ఉన్న ఫలక్‌నుమా ప్యాలెస్ (Falaknuma Palace)ను నిజాం సంస్కృతిని కాపాడేలా అందులో బ్రహ్మాండమైన హోటల్‌ను పెట్టి దానిని కూడా పరిరక్షించామని సీఎం చంద్రబాబు అన్నారు.






