- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ వాస్తవాన్ని గుర్తించాలి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సంచలన ట్వీట్
మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధుల విషయంలో సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సారి సంచలన ట్వీట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు (Munugodu) నియోజకవర్గం అభివృద్ధికి నిధుల విషయంలో సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మరో సారి సంచలన ట్వీట్ చేశారు. నియోజకవర్గాల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలన్నారని ఓ పేపర్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి రాసిన వ్యాసాన్ని ఆయన పోస్ట్ చేశారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ (Yennam Srinivasa Reddy) యెన్నం శ్రీనివాసరెడ్డి చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయని అన్నారు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి వ్యవహరించాలి.. అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. ట్వీట్ లింక్..






