MP Raghunandan Rao: మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

MP Raghunandan Rao: మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చంపేస్తామంటూ మావోయిస్టు పేరుతో వచ్చిన బెదరింపు కాల్ కు (Threat Call) భయపడేది లేదని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ కు ఆందోళనకు గురికాబోమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తనను చంపేస్తామంటూ మధ్యప్రదేశ్ మావోయిస్టుల పేరుతో వచ్చిన ఫోన్ కాల్ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. మధ్యప్రదేశ్ పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో ఇవాళ బెదిరింపు కాల్ వచ్చిందని రఘునందన్ రావు అన్నారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెంలోని ఓ పాఠశాల కార్యక్రమంలో ఉండగా +912143352974 నంబర్ నుంచి తనకు ఫోన్ చేసి ఇప్పుడే మధ్యప్రదేశ్ నుంచి మావోయిస్టు (Maoists) పార్టీ దళం బయలుదేరింది. ఇవాళ అర్థరాత్రి లోపు మెదక్ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామని హెచ్చరించారని చెప్పారు. ఈరోజు అర్థరాత్రి వరకే డెడ్ లైన్ అని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ రెండోసారి కూడా ఫోన్ చేశారన్నారు. ఆపరేషన్ కగార్ ను (Operation Kagar) ఆపేందుకు మావోయిస్టు పార్టీ ఏదైనా సెన్సేషన్ కోసం ప్రయత్నిస్తోందా? తెలియడం లేదన్నారు. ఈ క్రమంలో ఎవరిని బలితీసుకోబోతున్నారో అనేది తాము ఆందోళన చెందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story