దేశం మీద ఇదేనా మీ ప్రేమ ఓవైసీ.. కౌన్సిల్ మీటింగ్‌పై ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సభలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు.

దేశం మీద ఇదేనా మీ ప్రేమ ఓవైసీ.. కౌన్సిల్ మీటింగ్‌పై ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సభలో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సమయంలో కొంత మంది ఎంఐఎం సభ్యులు కుర్చీలో నుంచి లేవకపోవడం పట్ల బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అనంతరం

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో వందేమాతరం గీతం పాడాలని మేయర్‌ని అనుమతి అడిగాం అని తెలిపారు. మేయర్ దానికి ఒప్పుకున్నారు కాంగ్రెస్, BRS సభ్యులు కూడా ఒప్పుకున్నారని క్లారిటీ ఇచ్చారు. కానీ మజ్లిస్ సభ్యులు కనీస గౌరవం లేకుండా వారి కుర్చీల నుంచి లేవలేదని ఆరోపించారు.

దేశం స్వాతంత్ర్యం కోసం వందేమాతరం ఉద్యమం చేసి నినాదం ఇస్తే కులం, మతం, ప్రాంతం చూడకుండా ఉద్యమం చేశారని వివరించారు. కానీ మజ్లిస్ సభ్యులు దానికి మతం రంగు పూస్తున్నారని మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్ ను కోరినట్లు వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఓవైసీ బారిష్టర్ కదా.. దేశం మీద ఇదేనా మీ ప్రేమ అని ప్రశ్నించారు. బిహార్‌లో మజ్లిస్ కాంగ్రెస్‌కు ఎందుకు మద్దతు ఇవ్వలేదో ఓవైసీ‌ని అడగండని ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story