ఏపీ సైనిక్ స్కూల్స్‌లో తెలంగాణ లోకల్ కోటా కంటిన్యూ చేయాలి : ఎంపీ రఘునందన్ రావు

by Ramesh Naini |

ఈ విద్యా సంవత్సరం ఏపీ సైనిక్ స్కూల్స్‌లో తెలంగాణ విద్యార్థులకు లోకల్ కోటా కంటిన్యూ చేయాలని ఎంపీ రఘునందన్ రావు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఏపీ సైనిక్ స్కూల్స్‌లో తెలంగాణ లోకల్ కోటా కంటిన్యూ చేయాలి : ఎంపీ రఘునందన్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ విద్యా సంవత్సరం (AP Sainik Schools) ఏపీ సైనిక్ స్కూల్స్‌లో తెలంగాణ విద్యార్థులకు లోకల్ కోటా కంటిన్యూ చేయాలని ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన (సోమవారం) ఇవాళ ఒక వీడియో విడుదల చేశారు. సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్స్ కోసం తెలంగాణ విద్యార్థులు సుమారు 25 నుంచి 30 వేల మంది వరకు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. అయితే ఈ ఏడాది ఏపీ సైనిక్ స్కూల్స్‌లో 67 శాతం లోకల్ కోటాలో తెలంగాణ విద్యార్థులను తొలగించినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు. ఏపీలో గత పదేళ్లుగా 67 శాతం తెలంగాణ విద్యార్థులకు లోకల్ కోటాను తొలగిస్తూ ఇచ్చిన ఈ ఉత్తర్వులపై కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌తో ఫోన్‌లో మాట్లాడి అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు తెలిపారు.

కొత్తగా తెలంగాణకు మూడు సైనిక్స్ స్కూల్స్ మంజూరు చేయాలని, అవి వచ్చే వరకు ఈ విద్యా సంవత్సరం ఎవరైతే ప్రవేశ పరీక్షకు హాజరయ్యారో వారందరికీ 67 శాతం లోకల్ కోటా అలాగే ఉంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మంత్రి సైతం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. రేపు సాయంత్రం కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిని కలుస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Next Story