పాలమూరుకు అన్యాయం చేసింది కేసీఆరే.. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.

పాలమూరుకు అన్యాయం చేసింది కేసీఆరే.. ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఇవాళ (సోమవారం) బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ మొత్తం దోచుకున్నారని ఆయన ఆరోపించారు. పాలమూరుకు అన్యాయం చేసింది కేసీఆరే అని విమర్శించారు. పాలమూరు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను ఎంపీగా గెలిపించారని, ఐదేళ్లు పాలమూరు ఎంపీగా ఉండి.. పార్లమెంట్‌లో ఒక్కరోజైన మాట్లడారా? అని ప్రశ్నించారు. చివరికి మీకు ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. కాళేశ్వరం కమీషన్ల కోసం పాకులాడారు.. తప్పితే పాలమూరును పట్టించుకోలేదని, ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి చేయాలేదని ప్రశ్నించారు.

రెండేళ్లు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటే.. మొత్తం తెలంగాణ పడుకోవాలి, నేడు నిద్ర లేచాడు కాబట్టి ఆయన వెంట మొత్తం తెలంగాణ పరిగెత్తాలి? ఇదెక్కడి న్యాయం అని నిలదీశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నేపథ్యంలో కేసీఆర్ బయటికి వచ్చారని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను మర్చిపోయారని, కేసీఆర్ వెంట నడిచేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. త్వరంలో బీఆర్ఎస్‌కు చరమగీతం పాడుతారని చెప్పారు. బీజేపీ ఎంపీలు ఏం చేశారో చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చర్చకు రావొచ్చని అన్నారు.

Next Story