MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్!

by Disha Web Desk 2 |
MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాక‌ర్‌ను తన అభిమానులు చంపేస్తారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చర్యలకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొమటిరెడ్డి వ్యాఖ్యలపై గాంధీ భవన్‌లో బుధవారం పార్టీ క్రమశిక్షణ సంఘం సమావేశం అయింది. పార్టీకి, పార్టీ నేతలకు వ్యతిరేకంగా వెంకట్ రెడ్డి తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై పలువురు నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వెంకట్ రెడ్డిని ఇలానే ఉపేక్షిస్తే అది పార్టీకే నష్టం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక సందర్భాల్లో వెంకట్ రెడ్డి పార్టీకి నష్టం కలిగించే రీతిలో మాట్లాడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అతడిపై చర్యలు తీసుకోకుంటే బయటకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే చర్చ పార్టీలో జరుగుతోంది.

ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ భేటీ కావడం హాట్ టాపిక్ అవుతోంది. వెంకట్ రెడ్డి కామెంట్స్ పై ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు థాక్రేతో పాటు ఏఐసీసీ దృష్టికి టీపీసీసీ నేతలు తీసుకువెళ్లగా ఇవాళ్టి సమావేశం అనంతరం వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య విభేదాలు ఉన్న తారా స్థాయికి చేరుకుంది. వెంకట్ రెడ్డి వ్యవహారాన్ని ఇక సహించేది లేదని రేవంత్ వర్గం అధిష్టానం వద్ద తమ వాదనను బలంగా వినిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో వెంకట్ రెడ్డి వ్యవహార శైలి, ఇటీవల పొత్తులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, తాజాగా సొంత పార్టీ నేత చెరుకు సుధాకర్ రెడ్డిని చంపేయబోతున్నారంటూ చేసిన కామెంట్స్ అన్నింటిపై అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇవాళ్టి క్రమశిక్షణ సంఘం భేటీలో ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేదికి ఆసక్తిగా మారింది. ఒకవేళ షోకాజ్ నోటీసులు జారీ చేస్తే వాటిపై వెంకట్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.



Next Story

Most Viewed