- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > BREAKING: జార్ఘండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం
BREAKING: జార్ఘండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయం
by Kema Shiva Kumar |
దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదు అవుతుండటంతో ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదు అవుతుండటంతో ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ జార్ఘండ్ రాజధాని రాంచీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని బీఎస్ఎన్‌ఎల్ కార్యాలయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త కార్యాలయ ఆవరణలో ఉన్న కేబుళ్లకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున్న మంటలు ఎగసిపడుతున్నాయి. అప్రమత్తమైన బీఎస్ఎన్ఎల్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ మేరకు పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఆదివారం కావడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయంలో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
Next Story






