ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కుండబద్దలు కొట్టిన పురంధేశ్వరి.. చిక్కుల్లో మిత్రపక్షం..!

by Disha Web Desk 16 |
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కుండబద్దలు కొట్టిన పురంధేశ్వరి.. చిక్కుల్లో మిత్రపక్షం..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ల్యాండ్ టైటిలింట్ యాక్ట్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌ను తీసుకొచ్చారు. భూములపై శాశ్వత హక్కు అంటూ ఈ యాక్టుకు సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదించారు. అనంతరం రాష్ట్రపతి వద్దకు పంపారు. కానీ ఈ బిల్లు పెండింగ్‌లో ఉంది. అయితే ఈ యాక్టపై పలు అనుమానాలు తలెత్తాయి. భూములు కబ్జా చేసేందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ యాక్టును తీసుకొచ్చారని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేశారు. ఈ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకోవాలని ఏపీ సీఐడీని ఈసీ అదేశించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు.. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి టీడీపీ నేతలను విచారించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం విచారించారు.

ఇదిలా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చగా మారాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి అయోగ్ ప్రతిపాధించిన చట్టమని ఆమె బాంబు పేల్చారు. అంతేకాదు ఆ చట్టాన్ని అమలు చేయడం ఆయా రాష్ట్రాల ఇష్టమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి ఉండదని కుండ‌బద్దలు కొట్టారు. దీంతో మిత్రపక్షానికి చిక్కులు తప్పవా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు దుష్ప్రచారం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు చర్యలకు ఈసీ ఆదేశించింది. దీంతో విచారించాలని రాష్ట్ర సీఐడీని ఈసీ రంగంలోకి దింపింది. ఈ సమయంలో పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ఇబ్బందికరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ నేతలు చేసినవి అసత్య ప్రచారమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఏం పురంధేశ్వరి కామెంట్స్‌పై టీడీపీ నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Read More..

దేశం గర్వంచే విషయంలో బిగ్ షాక్... సీఎం జగన్‌పై అమిత్ షా షాకింగ్ కామెంట్స్

Next Story

Most Viewed