ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన ప్రభాస్ ‘బుజ్జి’.. ఎవరంటే! (పోస్ట్ వైరల్)

by Hamsa |
ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన ప్రభాస్ ‘బుజ్జి’.. ఎవరంటే! (పోస్ట్ వైరల్)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం ‘కల్కి2898ఏడి’. దీనిని స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా.. ఇందులో స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే కల్కి సినిమాను వైజయంతి మూవీ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. జూన్ 27న థియేటర్స్‌లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో.. ప్రభాస్ తన బుజ్జిని పరిచయం చేయడానికి వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ పోస్ట్ పెట్టడంతో నెట్టింట పలు చర్చలు మొదలయ్యాయి. తాజాగా, బుజ్జి ఎవరనేది? తెలిసిపోయిందని ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సమయం ఒక భ్రమ్ అనే క్యాప్షన్ జత చేసి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే బుజ్జి అంటే కారు అని సమాచారం. దానికి టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతుందట.

Click Here For Twitter Post..

Next Story

Most Viewed