మోసం గురించి షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. ఆ ఇద్దరు హీరోయిన్స్ ప్రేమ పేరుతో అలా చేశారా?

by Disha Web Desk 6 |
మోసం గురించి షాహిద్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. ఆ ఇద్దరు హీరోయిన్స్ ప్రేమ పేరుతో అలా చేశారా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ పలు చిత్రాల్లో నటించి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ పరంగా సక్సెస్‌ ఫుల్ హీరోగా పేరుతెచ్చుకున్న ఆయన వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. షాహిద్ కపూర్ గత ఏడాది బ్లడీ డాడీ మూవీతో మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం ‘తేరీ బతన్ మెయిన్ ఐసా ఉల్ఝా జియా’ అనే సినిమాతో రాబోతున్నాడు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాహిద్ కపూర్ తనను ఓ ఇద్దరు మోసం చేసినట్లు తెలుపుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రేమలో ఎన్నిసార్లు మోసపోయారని యాంకర్ అడగ్గా.. ‘‘ఒక మోసం గురించి నాకు తెలుసు. నేను కచ్చితంగా దాని గురించి మాట్లాడగలను. కానీ మరొక దాని గురించి చాలా పెద్ద సందేహాలు మిగిలిపోయాయి. కాబట్టి వాటి గురించి నేను మాట్లాడొద్దని అనుకుంటున్నాను. వాటికి నేను ఎలాంటి పేరు పెట్టాను.

లవ్ ఫెయిల్యూర్ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో యాంకర్ మీరు డేటింగ్ చేసిన ఇద్దరు మహిళల గురించేనా? అని అడిగింది. దానికి షాహిద్ నేను చెప్పను అంటూ నిరాకరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారు డేటింగ్ చేసింది కరీనా కపూర్, ప్రియాంక చోప్రాతో కాబట్టి వారే తనను మోసం చేశారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Read More..

మాకు మద్దతు ఇస్తారనుకుంటున్నానంటూ ప్రియాంక చోప్రా భర్త ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఆందోళనలో ఫ్యాన్స్!


How Many Women's Cheated on Shahid Kapoor?
byu/Haterskahater inBollyBlindsNGossip

Next Story