దిశ ఎఫెక్ట్... అక్రమ మట్టి తోలకాలకు బ్రేక్

by Sridhar Babu |
దిశ ఎఫెక్ట్... అక్రమ మట్టి తోలకాలకు బ్రేక్
X

దిశ, వైరా : మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్ నుంచి అక్రమ మట్టి తోలకాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. రైతుల పొలాలకు నల్ల మట్టి తోలేందుకు ప్రభుత్వం మంజూరు చేసే అనుమతులను అడ్డుగా పెట్టుకొని వైరా రిజర్వాయర్లో గత నెల రోజులుగా ఇస్టారాజ్యంగా గలస మట్టిని రియల్ ఎస్టేట్ ప్లాట్లకు, ఇతర అవసరాలకు రవాణా చేశారు. ఈ విషయమై శుక్రవారం దిశ దినపత్రికలో అడ్డు అదుపేది....? అనే వార్త కథనం ప్రచురితమైంది. ఈ వార్త కథనంతో స్పందించిన

నీటిపారుదల శాఖ జిల్లా ఉన్నతాధికారులు అక్రమ గలస మట్టి రవాణాను అరికట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం, శనివారం వైరా రిజర్వాయర్లో మట్టి తవ్వకాలకు వచ్చిన జేసీబీలు , ట్రాక్టర్లను నీటిపారుదల శాఖ సిబ్బంది అడ్డుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ లోని గలస మట్టిని అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో గత రెండు రోజులుగా అక్రమ గలస మట్టి రవాణా నిలిచిపోయింది.

Next Story

Most Viewed