- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోండి: ఈటల
తుఫాన్ కారణంగా నోటికాడికి వచ్చిన పంట నీళ్ల పాలైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి, యంత్రాంగం అంతా రైతులను కలుస్తుంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు.

దిశ,వెబ్ డెస్క్: తుఫాన్ కారణంగా నోటికాడికి వచ్చిన పంట నీళ్ల పాలైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి, యంత్రాంగం అంతా రైతులను కలుస్తుంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో లక్షల ఎకరాల పంట నాశనం అయ్యిందన్నారు. డీసీఎంలు, కార్లు వరద ఉధృతికి కొట్టుకుపోయాయని చెప్పారు. దానిని బట్టి వరద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవాలన్నారు. క్లౌడ్ బరస్ట్ కంటే ఎక్కువ ప్రభావం చూపించిందన్నారు. వరంగల్ నగరం సగం వరకు నీటిలో మునిగిపోయిందన్నారు. ఊర్లలో రైతులు ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసి రైతులను ఓదార్చాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.






