- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ ఇకనైనా ఆపు.. పేదల జోలికొస్తే మాడి మసైపోతావ్.. హైడ్రా కూల్చివేతలపై ఈటల హెచ్చరిక
రేవంత్ ఇకనైనా ఆపండి.. పేదల జోలికి వస్తే మాడి మసి అవుతారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (CM Revanth Reddy) రేవంత్ ఇకనైనా ఆపండి.. పేదల జోలికి వస్తే మాడి మసి అవుతారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajendar) హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గలోని (Gajularamaram) గాజులరామారంలో ఎంపీ ఈటల పర్యటించారు. హైడ్రా కూల్చిన ఇళ్లను పరిశీలించిన ఆయన బాధితులను పరామర్శించారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ దేవుడు ఎరుగు 40 ఏళ్లుగా ఇక్కడే బ్రతుకుతూ.. పని చేసి బతికే పేదవారి ఇల్లు కూల్చారని మండిపడ్డారు. దేశం ఇంకో దేశం మీద దాడి చేసినట్టు దొంగ దెబ్బ తీసినట్టు.. పదుల సంఖ్యలో జేసీబీలు పెట్టి ఆదివారం వచ్చి కళ్ళ ముందు ఇల్లు కూలగొట్టారని అన్నారు. బ్రోకర్లను ఉరి తీయండి, అరెస్ట్ చేయండి కానీ 40 ఏళ్ల నుంచి ఉంటున్న వారి ఇళ్లను కూలగొట్టి ఆడబిడ్డలకు బతుకమ్మ సంబరాలు లేకుండా చేసి వారి కన్నీటిని చూశారని మండిపడ్డారు. పిల్లల పుస్తకాలు, ఇంట్లో సామాన్లు తొక్కించారు. కన్నీరు మున్నీరు అవుతున్నా కనికరించలేదు.. నిజాంలు, రాజులు కూడా ఇంత మూర్ఖంగా ప్రవర్తించ లేదని మండిపడ్డారు. హైడ్రా మీకు దమ్ముంటే ప్రభుత్వం స్థలంలో బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు తొలగించాలని సవాల్ చేశారు.
300 ఎకరాలు, రూ. 15 వేల కోట్ల కాపాడిన అంటున్నారు.. ఇక్కడ ఉంది 300 గుడిసెలు, ఇల్లు మాత్రమే, వాటిని కూలగొట్టి వేల కోట్లు కాపాడామని సోషల్ మీడియా, ట్విట్టర్‌లో ప్రచారం చేసుకోవడానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. రంగనాథ్ ఇక్కడికి వచ్చి చూడు.. శంకర్ హిల్స్ లాంటివి, వంద కోట్ల ఎకరా ఉన్న భూములు కబ్జా పెడితే పట్టించుకోరు.. నోరు లేని వారిని, దిక్కు లేని వారిని, పేదరికంలో మగ్గుతున్న వారికి కన్నీళ్లు పెట్టిస్తే నీకు మంచి జరగదన్నారు.
వీరు పరాయి వారు కాదని, పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్లా ? భారత మాత బిడ్డలు కాదా? అని ప్రశ్నించారు. బ్రోకర్ల ఉంటే అరెస్ట్ చేయాలని, వారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని అన్నారు. కానీ పెదల జీవితాలతో ఆడుకోవద్దని, వారి మీద ప్రతాపం చూపొద్దన్నారు. ఇదేనా నీ ఇందిరమ్మ రాజ్యం.. రూ. 2500 ఇవ్వలేదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు కానీ ఉన్న గూడు చెదరగొడుతున్నారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వెంటనే కూలగొట్టిన వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ప్రభుత్వ భూములు పేదలకు దక్కాలని డిమాండ్ చేశారు.






