డిండి ప్రాజెక్టుకు నీళ్లు తరలించే ప్రతిపాదన సరికాదు.. ఎంపీ డీకే అరుణ

by Ramesh Naini |

మాజీ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు గుప్పించారు.

డిండి ప్రాజెక్టుకు నీళ్లు తరలించే ప్రతిపాదన సరికాదు.. ఎంపీ డీకే అరుణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రూపు రేఖలు మార్చేశారని అన్నారు. ఆదివారం ఆమె జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల పాదాలు కడుగుతా అన్నారు.. పదేళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేకపోయారని డీకే అరుణ అన్నారు.

నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్ సాగర్, ఆర్డీఎస్ వంటి ప్రాజెక్టులను వారి రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టులపై దృష్టి సారించలేదన్నారు. కేవలం డైలాగులతోనే పాలమూరు జిల్లా ప్రజలను తృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జూరాల అప్రోచ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తీసి.. నార్లాపూర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర అప్రోచ్‌ను మార్చారని వెల్లడించారు. నాడే తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిపారు. దీని వల్ల ప్రాజెక్టు పూర్తి కాదు.. కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆ నాడే మాట్లాడినట్లు తెలిపారు. డిండి ప్రాజెక్టుకు నీళ్లు తరలించే ప్రతిపాదన సరికాదని, మళ్లీ పొరపాటు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Next Story