- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుంభకర్ణుడు మాదిరి కేసీఆర్ రెండేళ్ల తర్వాత నిద్ర లేచాడు : ఎంపీ డీకే అరుణ
by Ramesh Naini |
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుంభకర్ణుడు నిద్ర లేచినట్లుగా కేసీఆర్ రెండేళ్ల తర్వాత నిద్ర లేచాడని విమర్శలు గుప్పించారు. తన అధికారం కోల్పోయాక రెండేళ్లకు బయటకు వచ్చాడని, తెలంగాణలో ఏం జరిగిందో తెలియకుండా మరిచిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. గడిచిన పదేళ్లు బీజేపీ మీదనే ఏడ్చి, ఇప్పుడు కూడా బీజేపీ మీదనే ఏడుస్తున్నారని మండిపడ్డారు. పాలమూరుకి ఏదో ఇప్పుడే అన్యాయం జరుగుతున్నట్లు కేసీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్‌కు మతిమరుపు వచ్చిందన్న అనుమానం కలుగుతుందని అన్నారు. పదేళ్ల పాటు తెలంగాణని పాలించింది ఆయనే అన్న సంగతి కూడా మర్చిపోయాడా? అని బీజేపీ ఎంపీ డీకే అరుణ అనుమానం వ్యక్తం చేశారు.
Next Story






