- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mp DK Aruna: ఇదెక్కడి చోద్యం.. కేసీఆర్‌కు సంబంధం లేదా..?
కాళేశ్వరం విషయంలో mlc కవిత వ్యాఖ్యలపై ఎంపీ Dk. అరుణ స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం విషయంలో mlc కవిత వ్యాఖ్యలపై ఎంపీ Dk. అరుణ స్పందించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్వయంగా కవితనే ఒప్పుకుంటున్నారని, కానీ.. కేసీఆర్‌కు సంబంధం లేదంట.. ఇదెక్కడి చోద్యమని ఆమె సెటైర్స్ వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పాలించింది కేసీఆర్ కుటుంబమే కదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ కుటుంబం మొత్తానికి సంబంధమని, ఇది ఎవ్వరు కాదనలేని నిజమని అరుణ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ BRS తీరు దొందు దొందే అని, దొంగలు దొంగలు గాట్లు పంచుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇదంతా BRS కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంలా కనిపిస్తోందన్నారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిన వాళ్లపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదా? అని డీకే అరుణ ప్రశ్నించారు. అంతన్నారని, ఇంతన్నారని.. చేసేదేమి లేక CBI ఎంక్వయిరీ అంటున్నారని డీకే అరుణ మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిటీ సూచనల ప్రకారం నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. తమరు వేసిన కమిటీ మీద మీకు నమ్మకం లేదా..? అని డీకే అరుణ నిలదీశారు.
‘‘ఆ కమిటీ నివేదికలో ఏం తెల్చారు..? ఎవరిని దోషులుగా చూపారో ఎందుకీ బయట పెట్టలేదు. మీరు వేసిన కమీసన్ మీద మీకు నమ్మకం లేదా..?. ఆ ఇంట్రెస్ట్ కాంగ్రెస్‌కు ఉండి ఉంటే ముందే cbi విచారణకు ఎందుకివ్వలేదు. ఇదంతా చూస్తుంటే వేళ్ళకు కాళేశ్వరం అవినీతిని బయట పెట్టే విషయంలో చిత్తశుద్ధి లేదని అర్థం అవుతోంది. కాళేశ్వరం విషయంలో మేము ముందే cbi ఎంక్వయిరీ అంటే ఉలకలేదు, పలకలేదు.’’ అని డీకే అరుణ తెలిపారు.






