- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP Dharmapuri Arvind: జీవన్ రెడ్డిని వేధిస్తూ హింసించడం ఆపండి !
కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పై నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పై నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ అయిన జీవన్ రెడ్డిని కాంగ్రెస్ చాలా వేధిస్తోందని ఎమోషనల్ అయ్యారు. మంచి నాయకుడిని కాపాడుకోవాల్సిన కాంగ్రెస్, చాలా ఇబ్బందులకు గురిచేస్తుందని ఫైరయ్యారు. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి అరవింద్ హాజరై మాట్లాడారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి తనకు తండ్రితో సమానమని ప్రశంసించారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ ఆగం చేస్తోందని ఫైర్ అయ్యారు. పార్టీకి ఎన్నో సేవలు చేసిన ఆయన పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందన్నారు. మంచి మనసున్న జీవన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం తనకు అస్సలు నచ్చడం లేదని పేర్కొన్నారు. దయనీయ పరిస్థితిలో ఉన్న జీవన్ రెడ్డిని ఇప్పుడే పలకరించాలని తనకు ఉందని వెల్లడించారు. కానీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జీవన్ రెడ్డిని కలిస్తే తప్పుడు మెసేజ్ బయటకు వెళ్తుందని ఆగినట్లు స్పష్టం చేశారు ధర్మపురి అరవింద్. అటు రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు కూడా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేసే కాంగ్రెస్ సర్కార్ కు లేదని విమర్శలు చేశారు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్. క్లిక్






