- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీకి రండి.. తెలంగాణ ద్రోహి ఎవరో తేల్చుకుందాం.. హరీశ్‌రావుకు ఎంపీ చామల కిరణ్ సవాల్

దిశ, తెలంగాణ బ్యూరో: డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్లు-నిజాలపై అసెంబ్లీలో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించారని, ఎవరు తెలంగాణ ద్రోహి అనేది అసెంబ్లీ సాక్షిగా నిరూపిస్తామన్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తారో లేదో చెప్పకుండా వాళ్ల మామ చెప్పనదాన్నే మళ్లీ మళ్లీ చెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో యూరియా ఇంటికి తెచ్చి ఇచ్చామని మాట్లాడుతున్నారు.. మీ పదేళ్ల పనితనం ప్రజలు మరిచిపోయారని అనుకుంటున్నారా? అని నిలదీశారు. యూరియా కోసం రైతులు ఎన్ని అవస్థలు పడ్డారో, మీ పనితనమేందో.. పత్రికల్లో వచ్చిన వార్తలే నిదర్శనం అని గుర్తుకుచేశారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్దాలు నిజం కావు అని మండిపడ్డారు. ఇప్పటికైనా మా ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని సూచించారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే ఎవరు ద్రోహి అనేది తేటతెల్లం అవుతుందని అన్నారు.






