కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు మీరే కదా? సీబీఐ విచారణ జరిపించు: ఎంపీ చామల కిరణ్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

కేసీఆర్ దేవుడు.. కానీ, కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు మీరే కదా? సీబీఐ విచారణ జరిపించు: ఎంపీ చామల కిరణ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ దేవుడు.. కానీ, కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌కు రాసిన లేఖ బహిర్గతం అవ్వడంపై కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) స్పందించారు. ఇవాళ (శనివారం) ఢిల్లీలో ఎంపీ చామల మీడియాతో మాట్లాడుతూ.. కవితమ్మా.. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు మీరే కదా? అని ఎంపీ హాట్ కామెంట్స్ చేశారు. నువ్వు ఒక దయ్యమే కదా.. మీ అయ్య చుట్టూ రెండు, మూడు మగ దయ్యాలు ఉన్నాయని విమర్శించారు. అయితే, మీ నాన్న పక్కన దెయ్యాలు ఉన్నాయని నువ్వు చెప్పిన మాట వాస్తవమైతే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ దెయ్యాలు అన్ని నాడు ఇరిగేషన్, మున్సిపల్ వంటి శాఖల్లో స్కామ్‌లు చేసి లక్షల కోట్లు దోచుకున్నాయో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. నీ మీద తెలంగాణ ప్రజలకు ఒక నాయకురాలిగా మంచి అభిప్రాయం రావాలంటే ఈ దెయ్యాల మీద సీబీఐ విచారణ జరిపించాలని ఒక లేఖ రాయాలని డిమాండ్ చేశారు. అప్పుడే నువ్వు చేసే ఆరోపణలు నిజం అని తేలుతుందని ఎంపీ చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ ఆరోపణలు చేసి.. ఒక లెటర్ లీక్ చేశారని మీకు మీరే గొడవ చేసుకుంటే.. తెలంగాణ ప్రజలు మీ కుటుంబాన్ని నమ్మరని ఆయన కవితకు సూచనలు చేశారు.

Next Story