గ్రూప్-1పై ఆరోపణలు.. కేటీఆర్‌ను చెప్పుతో కొట్టాలి.. ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్

by Ramesh Naini |   (  Updated:2025-09-14 10:15:59  IST  )

కాంగ్రెస్ మంత్రులు గ్రూప్-1 పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

గ్రూప్-1పై ఆరోపణలు.. కేటీఆర్‌ను చెప్పుతో కొట్టాలి.. ఎంపీ చామల కిరణ్ కుమార్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ మంత్రులు (Group 1) గ్రూప్-1 పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో రిలీజ్ చేశారు. గ్రూప్ 1 నియామకాలపై ఆరోపణలు చేసిన కేటీఆర్‌ను చెప్పుతో కొట్టాలని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. 563 మంది అభ్యర్థుల దగ్గర రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగ నియామకాలు చేసినట్లు కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేస్తూ ఇండియాకు వచ్చి మంత్రి పదవి చేపట్టిన కేటీఆర్ రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్ కు గ్రూప్ 1 అభ్యర్థుల తల్లిదండ్రులు బుద్ధి చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పెట్టే పరిస్థితి లేదని, సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని ఎంపీ చామల పేర్కొన్నారు.

Next Story