కబ్జాలను అడ్డుకుంటుంటే కేటీఆర్‌కు భయమెందుకు? ఎంపీ చామల కిరణ్ కౌంటర్

by Ramesh Naini |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

కబ్జాలను అడ్డుకుంటుంటే కేటీఆర్‌కు భయమెందుకు? ఎంపీ చామల కిరణ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేటీఆర్ బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కేసీఆర్ కుటుంబం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను వంచించి అప్పుల పాలు చేసిందని, కేవలం తమ సొంత సంపదనే పెంచుకుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయితే, కేటీఆర్ మేనేజ్‌మెంట్ కోటాలో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్‌గా జడ్పీటీసీ, ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి, ప్రస్తుతం సీఎం అయ్యారని ఆయన గుర్తుకు చేశారు. మెరిట్ కోటా, పేమెంట్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా ఎవరిదో తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఎప్పుడు అధికారం తమకే ఉంటుందని బీఆర్ఎస్ హయాంలో నియంత పాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా కూల్చివేతలు ప్రజల ప్రయోజనం కోసమేనని, అక్రమ కబ్జాలను అడ్డుకుంటుంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

Next Story