- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MP Arvind: కేటీఆర్.. దమ్ముంటే ఎంపీ పేరు బయటపెట్టు.. అర్వింద్ ఫైర్
కంచ గచ్చబౌలి భూముల విషయంలో కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఎంపీ అర్వింద్ ఘాటుగా స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో (Kancha Gachibowli Lands) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్‌కు (KTR) దమ్ముంటే ఆ బీజేపీ ఎంపీ ఎవరో పేరు చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉంటి అవినీతికి సంబంధించిన విషయాలు తెలిసి కూడా పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పులన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చేసి ఆరోపణలు మాత్రం బీజేపీపై వేస్తున్నారని మండిపడ్డారు. ఐసీఐసీఐ నుంచి రుణాలు తీసుకుంటే ముందు ఆ బ్యాంక్‌పై విచారణ జరగాలన్నారు. ఇదివరకే హెచ్‌సీయూకు ఇచ్చిన భూములపై అప్పు ఎలా తెస్తారని నిలదీశారు. ఈ విషయంలో కచ్చితంగా విచారణ జరగాలన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు యూనివర్సిటీ పేరున చేస్తే ఈ అంశం ముగిసిపోతుందన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ ఆ పని చేయలేదని, హెచ్‌సీయూ భూములపై కేటీఆర్, కవితకు మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.
అసత్యాల, అబద్ధాల ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో అసత్యాల, అబద్ధాల ప్రభుత్వం నడుస్తోందని అర్వింద్ విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, పరిపాలన జీరో అని దుయ్యబట్టారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని, వాటిని నెరవేర్చాలన్న తపన కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. ఏడాదిన్నర పాలనలో ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు హైడ్రా, పుష్ప, కులగణన, హెచ్‌సీయూ మీద పడ్డారు తప్పితే హామీలను అమలు చేయాలనే ప్రయత్నం లేదని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులపై రేవంత్‌రెడ్డి మాట్లాడినంత మరెవరూ మాట్లాడలేదని, లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసినా ఎందుకు అమలుకాని వాగ్దాలు ఇచ్చారని నిలదీశారు. ప్రగతిభవన్‌లో లంకెబిందెలు ఉండవని, ఫామ్‌హౌస్‌లో ఉంటాయని, దమ్ముంటే అక్కడికి పోవాలని సీఎంకు సవాల్ విసిరారు. నాలుగు పుస్తకాలు చదివినా మీకే ఇంత తెలివి ఉంటే 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు లంకె బిందెలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదా అని ప్రశ్నించారు.
గజ దొంగల్లా కేసీఆర్, రేవంత్
కేసీఆర్ పక్కన ఉన్న దొంగలే ఇప్పుడు రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పక్కన ఉన్నారని అర్వింద్ ఆరోపించారు. కమీషన్లు మింగుడు తప్ప మంత్రులు ఏమి చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు ఇలా ఉంటే ప్రతిపక్షం ఫామ్‌హౌస్‌లో పడుకుందని విమర్శించారు. ప్రజలు ఇంకా ఇబ్బందులు పడాలని.. అప్పుడు బయటకు వస్తానని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ ఇది దొర మనస్తత్వం అని అన్నారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి గజదొంగ గంగన్న, రంగన్నలా తయారయ్యారని సెటైర్ వేశారు. కేసీఆర్ వ్యవస్థలను విధ్వంసం చేస్తే, రేవంత్‌రెడ్డి అందరని భయపెట్టి వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వమన్న రేవంత్‌రెడ్డి విమర్శిస్తుంటే మరో వైపు మంత్రులు మోడీ చేసిన పనులను ప్రశంసిస్తున్నారన్నారు. పవన్ కల్యాణపై మాట్లాడే అర్హత కవితకు ఉన్నదా..? అని ప్రశ్నించారు.






