- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP Arvind: రాష్ట్రమంతా తిరిగినా కవితకు 400 ఓట్లు రావు: ఎంపీ అర్వింద్
కేసీఆర్ ఫోటో లేకుంటే కవితను ఎవరూ పట్టించుకోరని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రమంతా తిరిగినా కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ‘జాగృతి జనం బాట’ (Jagruti Janam Bata) జిల్లాల పర్యటన సందర్భంగా కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలపై అర్వింద్ స్పందించారు. తాజాగా ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన అర్వింద్ (MP Dharmapuri Arvind).. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేదో ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను కవిత అడగాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత అక్రమంగా సంపాధించిన కోట్లాది రూపాయలు తీసుకువచ్చి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. నాలుగు సంవత్సరాలు కాదు కదా నాలుగు జన్మలెత్తినా ప్రజలు కవితకు ఓట్లు వేయరన్నారు. కేసీఆర్ ఫోటో లేకుండా కవితను ఎవరూ పట్టించుకోరని, కేసీఆర్ ఫోటోతోనే కవిత తన జీవితంలో ఒక్క సారి ఎంపీ అయ్యారని విమర్శించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడగాలన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని బీజేపీ ఎన్ని స్థానాలు గెలవబోతోంది అనేది చెప్పగలను కానీ జూబ్లీహిల్స్ నేనెట్లా చెప్పగలనన్నారు.
READ MORE ....
నా వెనకాల మొరిగేటోళ్లను పట్టించుకోను.. కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్






