NHAI: బెంగళూరు హైవేపై ఇవేం స్పీడ్ లిమిట్స్?

by Prasad Jukanti |   (  Updated:2025-09-17 07:24:33  IST  )

వాహనాల వేగం పెంచేందుకు జాతీయ రహదారులు నిర్మిస్తుంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూసి వాహనదారులు షాక్ అవుతున్నారు.

NHAI: బెంగళూరు హైవేపై ఇవేం స్పీడ్ లిమిట్స్?
X

దిశ, డైనమిక్ బ్యూరో : రోడ్డు మార్గాల్లో ప్రయాణం వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయి రహదారులను తలదన్నేలా నిర్మాణం కొనసాగుతుందని కేంద్రం చెబుతోంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వాహనదారులను కంగుతినిపిస్తున్నాయి. హైదరాబాద్ -బెంగళూరు హైవేపై శంషాబాద్ నుంచి వెళ్తున్న మార్గంలో జడ్చర్ల వరకు హైవేపై ఉన్న స్పీడ్ లిమిట్ బోర్డులను చూసి వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. 60 కిలో మీటర్ల వేగంతో ఉన్న స్పీడ్ లిమిడ్ బోర్డులు పది అడుగుల దూరం దాటేలోపే 40 కిలోమీటర్ల వేగంతో అలర్టు బోర్డులు దర్శనమిస్తున్నాయి. వాహనాల వేగం పెంచడం కోసమే హైవేల నిర్మాణం చేపడుతుండగా ఇలా ఇంత దారుణంగా వేగ పరిమితి తగ్గించడం ఏంటని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల తీరుపై వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పది అడుగుల్లోనే అంత వేగాన్ని నియంత్రించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు.

Next Story