- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌశిక్ రెడ్డికి వరుస షాక్‌లు.. మొత్తం పది కేసులు నమోదు
బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి వరుస షాక్‌లు తగులుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మీద సంచలన ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి మీద మోకిల, శంకర్పల్లి, జూబిలీహిల్స్, రాజేంద్రనగర్, కేశంపేట్, మధురా నగర్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, చేవెళ్ల, కడ్తాల్ పోలీస్ స్టేషన్‌లలో కాంగ్రెస్ కార్యకర్తలు 10కి పైగా కేసులు(Police Case) పెట్టారు. కౌశిక్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో డీసీసీ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ తింసరి మహేష్, రహమత్ నగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు సజాత్, సీహెచ్.రవి, అనిల్ ముదిరాజ్, జగదీష్, ప్రసన్న కుమార్, నాసిర్, రాహుల్ ఉన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.






