నేటి సాయంత్రమే ముహూర్తం.. రైతులకు పండుగే పండుగ

by Bhoopathi Nagaiah |

తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నేటి సాయంత్రమే ముహూర్తం.. రైతులకు పండుగే పండుగ
X

తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు సాయంత్రానికి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. దీంతో గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్కడి ప్రభుత్వం తీర ప్రాంత ప్రజలను వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాలు దూసుకొస్తున్న తరుణంలో సౌత్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. ఈ రోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నదులు, జలపాతాల్లోకి వెళ్లొద్దని ప్రజలకు సూచించింది. రుతుపవనాల అప్ డేట్ కోసం ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

హైదరాబాద్‌లోని పబ్‌లపై ఎస్ఓటీ దాడులు నిర్వహించింది. అర్థరాత్రి మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలోని పలు పబ్‌ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాగా, డ్రగ్స్ సేవించిన యువకులు పట్టుబడ్డారు. మాదాపూర్‌లోని అకాన్ పబ్, గచ్చిబౌలి ఏఎంబీ మాల్‌లోని ఏ19 పబ్‌లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్‌ వచ్చింది. వారు డ్రగ్స్ సేవించినట్లు పరీక్షలలో తేలడంతో అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటీ వారిని పోలీసులకు అప్పగించారు. ఈ దాడులపై పూర్తి సమాచారం కోసం ఈ లింక్ ఓపెన్ చేయండి.

ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలకమండలి సమావేశం జరుగుతున్నది. ఈ దీనికి తెలుగురాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించ‌ద‌లుచుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రాష్ట్రం తరఫున ప్రత్యేక నివేదిక స‌మ‌ర్పించ‌నున్నారు. ఏపీకి సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ లింక్‌లో చూడండి.


ఏపీలోని ప్రధాన నగరమైన విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఇవాళ ఉదయం ఘోరం జరిగింది. బెంజ్​సర్కిల్​సమీపంలో ఉన్న నారా చంద్రబాబునాయుడు కాలనీలో కరెంట్​షాక్​తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఒకరిని కాపాడబోయి మరొకరు ఇలా కరెంట్​షాక్​తో మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి మృతదేహాల్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ లింక్‌లో చూడండి.

Next Story