మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణం.. శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-31 09:11:01  IST  )

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ప్రమాణం చేశారు.

మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణం.. శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ప్రమాణస్వీకారం చేయించారు. ఇవాళ రాజ్‌భవన్ (Raj Bhavan)లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మహమ్మద్ అజారుద్దీన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం 12.25కు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం కేవలం 9 నిమిషాల్లో ముగిసింది.

Next Story