Modi: మహిళలకు ప్రధాని మోడీ బర్త్ డే గిఫ్ట్.. కొత్త పథకం లాంచ్

by Prasad Jukanti |   (  Updated:2025-09-17 07:49:59  IST  )

మహిళల కొత్త పథకాన్ని ప్రధాని లాంచ్ చేశారు.

Modi: మహిళలకు ప్రధాని మోడీ బర్త్ డే గిఫ్ట్.. కొత్త పథకం లాంచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) అన్నారు. కానీ సర్దార్ వల్లబాయ్ పటేల్ చర్యల వల్ల సెప్టెంబర్ 17ను నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిందన్నారు. భారత దేశం ఐక్యత పట్ల మా గౌరవాన్ని వ్యక్తం చేస్తూ, ఏకత సందేశం, వీరుల త్యాగాలను గుర్తిస్తూ ఇవాళ హైదరాబాద్ లో లిబరేషన్ డే (Hyderabad Liberation Day) వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లిబరేషన్ దినోత్సవం నాకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఇవాళ మధ్యప్రదేశ్ లోని ధార్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ హీరోలను కొనియాడారు. అణుబాంబు బెందరింపులకు భారత్ భయపడదని, భారత పౌరుల ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్తామన్నారు.

'స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్' ప్రారంభం:

ఈ సభ వేదికగా ప్రధాని మోడీ మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా 'స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‍' పథకాన్ని ప్రారంభించారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ (Swasth Nari Sashakt Parivar Abhiyan) పథకం మహిళలకు గొప్ప వరం అని, ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని మోడీ చెప్పారు. మహిళా సాధికారత కోసం మహిళలు, యువతుల కోసమే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ పథకం అన్నారు. కేన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి మహిళళను రక్షించుకోవాలన్నారు. దేశాభివృద్దిలో మహిళల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. ఈ పథకంలో భాగంగా మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచడం, వైద్య సేవలు అందించడం, పోషకాహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించడం, కుటుంబాలను అందుకు అనుగుణంగా సన్నద్ధం చేయనున్నారు.

Next Story