- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగుల హక్కులు ప్రభుత్వం వేసే ‘బిక్ష’ కాదు : శాసనమండలిలో ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు
శాసనమండలిలో ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు దివ్యాంగుల హక్కులపై గళమెత్తారు.

దిశ, వెబ్ డెస్క్ : శాసనమండలిలో ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు దివ్యాంగుల హక్కులపై గళమెత్తారు. దివ్యాంగులకు ఇచ్చే సాయాన్ని ప్రభుత్వం వేసే బిక్షగా చూడకూడదని, అది సమాజం తీసుకోవాల్సిన నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు. కేవలం కాగితాలకే పరిమితమైన దివ్యాంగుల చట్టాన్ని క్షేత్రస్థాయిలో ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రైవేట్ థెరపీ సెంటర్ల దోపిడీ వల్ల దివ్యాంగుల కుటుంబాలు నష్టపోతున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు. ఎల్‌కేజీ నుంచే ప్రైవేట్ స్కూళ్లలో 5 శాతం ఉచిత సీట్లు ఇవ్వాలని, ప్రతి పాఠశాలలో సైకాలజిస్ట్ ఉండాలని డిమాండ్ చేశారు.
లక్షల రూపాయలు ఖర్చయ్యే థెరపీలు పేదలకు అందుబాటులో లేవని, వెంటనే ప్రభుత్వ థెరపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆటిజం, పక్షవాతం సహా 21 రకాల వైకల్యాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని, దివ్యాంగ పిల్లల తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేలా RPwD చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించారు. కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా దివ్యాంగుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే మనసున్న పాలన కావాలని శ్రవణ్ దాసోజు స్పష్టం చేశారు.






