- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి గ్రామంపైకి పోలీసులను పంపిస్తారా? ఎందుకింత పగ సీఎం గారు? ఎమ్మెల్సీ కవిత
నారాయణపేట-కోడంగల్ ఎత్తిపోతల పథకం కోసం సర్వే చేయడానికి వెళ్ళిన అధికారులును అక్కడి రైతులు అడ్డుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నారాయణపేట-కోడంగల్ ఎత్తిపోతల పథకం (Narayanpet Kodangal Lift Irrigation Scheme) కోసం సర్వే చేయడానికి వెళ్ళిన అధికారులును అక్కడి రైతులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దొంగల లాగా అర్ధరాత్రి సర్వేకు వచ్చారని పలువురు రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారుల తీరుతో ఓ మహిళా రైతు సృహ తప్పి పడిపోయింది. ఈ అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. ముఖ్యమంత్రి గారు రైతులు, పేదలపై ఎందుకింత పగ అని ప్రశ్నించారు. కొడంగల్ - నారాయణపేట ఎత్తిపోతల పథకం భూసేకరణ కోసం ఇంతటి దుర్మార్గం ఎందుకు? అని నిలదీశారు. అర్ధరాత్రి కానుకుర్తి గ్రామంపైకి పోలీసులను పంపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారా? అని ఆరోపించారు.
మొన్న లగచర్లలో బంజారా ఆడబిడ్డలపై మీ ప్రభుత్వం సాగించిన అఘాయిత్యాలనే (Kanukurthy) కానుకుర్తి ప్రజలపై కొనసాగిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నిరంకుశ చర్యలకు స్థానం లేదనే విషయం గుర్తించండని పేర్కొన్నారు. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు.. ఇదివరకే కానుకుర్తి ప్రజలకు అండగా నిలిచాం.. ఇకముందు కూడా వారి పక్షాన పోరాటంలో ముందే ఉంటామని వెల్లడించారు.






