- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు : ఎమ్మెల్సీ కవిత
by Bhanu |
కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పలు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొనేందుకు జగిత్యాలలో పర్యటించిన కవిత మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో మీడియాతో మాట్లాడారు.

X
దిశ, మేడిపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పలు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొనేందుకు జగిత్యాలలో పర్యటించిన కవిత మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ఉద్యోగులను కాంగ్రెస్ కించపరిచిందని అన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో విఫలమైందన్నారు.
ఉద్యోగుల కు పెండింగ్ లో ఉన్న డీఏలు విడుదల చేస్తామని చెప్పి కేవలం ఒక్క డీఏ విదిల్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న డీఎలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






