- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లు చెప్తేనే నన్ను అరెస్ట్ చేస్తారా..? లిక్కర్ స్కామ్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు
లిక్కర్ స్కామ్ కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: లిక్కర్ స్కామ్ కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియాక్ట్ అయ్యారు. విపక్ష నేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని ధ్వజమెత్తారు. ఏ ఏజెన్సీ ఎప్పుడు అరెస్ట్ చేయాలో బీజేపీ నేతలే చెబుతున్నారని.. బీజేపీ నేతలు చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అరెస్టులు అనేవి ఏజెన్సీలు చెప్పాలి. కానీ అందుకు భిన్నంగా బీజేపీ నేతలే చెబుతున్నారు. ఈ మాత్రం దానికి ఏజెన్సీలు ఎందుకు అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత.. అదానీపై సీబీఐ, ఈడీ దాడులు ఎందుకు జరగట్లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అదానీపై దర్యాప్తు మొదలైందన్నారు.
అదానీ అంశంపై జేపీసీ కోసం బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. మోదీ వైఫల్యాలపై నిలదీస్తే ఏజెన్సీలతో భయపెడుతున్నారన్నారని ఆరోపించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని భారత్ జాగృతి తరపున పోరాటం చేయబోతున్నట్టు ఈ సందర్భంగా కవిత ప్రకటించారు. ఇందుకోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మార్చి 10న దీక్ష చేయాలని నిర్ణయించామన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లును సభలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష కొనసాగుతుందన్న ఆమె తెలంగాణకు ఎంపీ సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు.






