- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: పుట్టిన రోజున కవిత ఇంటికే పరిమితం అయ్యారు. ప్రతి జన్మదినోత్సవం రోజు కవిత ఇంటిలో పార్టీ శ్రేణులతో కోలాహలంగా ఉండేది. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. సింపుల్ గానే జన్మదినోత్సవం నిర్వహించారు. కొద్దిమంది అనుచరులతోనే జరుపుకున్నారు. ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవం వచ్చిందంటే నేతలు పోటీపడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేవారు. ఆమెను కలిసేందుకు ఇంటికీ క్యూ కట్టేవారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె ఇళ్లంతా సందడిగా ఉండేది.
కానీ ఈసారి బోసిపోయింది. లిక్కర్ స్కాంలో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న తరుణంలో జన్మదినవేడకలకు కవిత దూరంగా ఉన్నారు. విషెస్ చెప్పడానికి సైతం ప్రముఖులు వెళ్లలేదు. ప్రతి ఏడాది ఏదో ఒకసేవా కార్యక్రమంలో భాగస్వామి అయ్యేది. కానీ దానికి సైతం దూరంగా ఉన్నారు. నేతలకు ముందస్తుగా కలువబోమని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కవిత సోమవారం ఇంటికే పరిమితం అయ్యారు. కార్యకర్తల కోలాహలం లేకపోవడంతో ఇంటి పరిసరాలు సైతం నిర్మానుషంగా మారాయి.
బీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు..
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్, టీఆర్ఎస్వీ, జాగృతి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. భారత్ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ తిరుపతి వర్మఆధ్వర్యంలో సుప్రీం కోర్ట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ అశోక్ నగర్ జాగృతి కార్యాలయం లో భారత జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు అనంతుల ప్రశాంత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.
నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో జరిగిన వేడుకల్లో జాగృతి నాయకులు, తెలంగాణభవన్ లో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొనగా, నిజామాబాద్ జడ్పీ కార్యాలయంలో, సెర్ఫ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో , రంగారెడ్డి జిల్లా కేంద్రంలో సర్ఫ్ సీసీ యూనియన్ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడులను నిర్వహించారు.






