- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha: తెలంగాణ రాష్ట్రం బాగుండాలి.. లాల్ దర్వాజా మహంకాళికి కవిత బోనం
ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా ఉదయం నుంచే వివిధ ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని పాతబస్తీలో (Bonalu festival) బోనల పండుగ సందడి నెలకొంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా ఉదయం నుంచే వివిధ ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) బోనం సమర్పించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కవిత ఫోటోలు షేర్ చేశారు. అమ్మవారి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించారు. కాగా, అంతకు ముందు ఎమ్మెల్యే కవిత ఉదయం కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మను దర్శించుకోని బోనం సమర్పించారు. అలాగే హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.






